Monday, May 6, 2024

ఓమ్మో ‘సిరి హ‌న్మంత్’ మ‌ళ్ళీ మొద‌లుపెట్టిందిగా

బిగ్ బాస్5 కంటెస్టెంట్ సిరిహ‌న్మంత్ మ‌ళ్లీ రీల్స్ చేయ‌డం స్టార్ట్ చేసింది. అది కూడా ప‌చ్చిగా మాట్లాడుతూ..తన బిగ్ బాస్ మేట్ జెస్సీతో కలిసి రీల్స్ చేయడం మొదలు పెట్టింది.ఆలా ఆమె ఒక రీల్ చేసింది. ‘నువ్వు కాల్ చేస్తే నేను కట్ చేసే పొజిషన్ నుంచి.. నేను కాల్ చేస్తే నీకు బిజీ వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్థమైంది. నువ్వు ఎవ‌రినో గోకుతున్నావ్ అని. ఎనీవే నేను నీకు దొరకడం నీ అదృష్టం.. నువ్వు ఇంకోదాన్ని తగులుకోవడం నా అదృష్టం.. నీకు సిగ్గులేదు.. దానికి బుద్ధి లేదు.. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ సిరి-జెస్సీలు పెర్ఫామెన్స్‌తో ఇరగదీసేశారు. ఆ రీల్ బాగా వైరల్ అయింది. అయితే ఆమె తాజాగా మరో రీల్ చేసింది. అందులో మీ సోల్ మేట్ ఎక్కడ ఉన్నారు అని అడిగిన ప్రశ్నకు మీతోనే ఉన్నారని పేర్కొంది. దానికి ప్రజలు నా గురించి ఏమి చెప్పినా నేను పట్టించుకోను, నా కథ నాకు మాత్రమే తెలుసు, నేను ఏమి అనుభవించానో నాకు మాత్రమే తెలుసు, నేను నిజమైన వ్యక్తిగా పుట్టాను ,అందరినీ మెప్పించడానికి కాద‌ని తెలిపింది ఈ బ్యూటీ అంద‌రూ బిగ్ బాస్ తో అంద‌నంత ఎత్తుకి ఎదుగుతుంటే ఇద్ద‌రు మాత్రం త‌మ జీవితాల్లో అల్ల‌క‌లోలాన్ని సృష్టించుకున్నారు. ఇది వారి స్వ‌యంకృతాప‌రాధ‌మ‌ని నెటిజ‌న్స్ అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement