Monday, May 6, 2024

ఎస్సై, కానిస్టేబుల్​ ఎంపిక వేగవంతం.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ ప్రక్రియ షురూ

జోగులాంబ గద్వాల, (ప్రభ న్యూస్) : ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కాబోతోంది. ఇందులో భాగంగా తుది రాత పరీక్షలో అర్హత సాధించిన జోగుళాంబ గద్వాల్, వనపర్తి జిల్లాలకు చెందిన వారి ధ్రువపత్రాలను వెరిఫై చేయనున్నారు. రేపటి (బుధవారం) నుండి ఈ నెల 24వ తేదీ వరకు 4,967 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఓ సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పరిశీలించనుందని ఎస్పీ కె సృజన తెలిపారు.

ఈ సందర్భంగా వెరిఫికేషన్ కు వచ్చే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులకు కేటాయించిన తేదిన ఉదయం 9 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలన్నారు. మహిళా అభ్యర్థులు ఉదయం 8 గంటలకే జిల్లా పోలీస్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలన్నారు. వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ఇంటిమేషన్ లెటర్ ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు వివరాల్లో సవరణలు అవసరం లేని అభ్యర్థులు నేరుగా పత్రాల పరిశీలన చేసుకోవచ్చని ఎస్పీ తెలిపారు.

- Advertisement -

ఒకవేళ సవరణ కోసం ఇప్పటికే ఆన్లైన్ లో అర్జీ పెట్టుకొని ఉంటే ఆ కాపీనీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థి సమక్షంలోనే ఆ సవరణలను అధికారులు ఆమోదిస్తారని, అభ్యర్థులు డ్రైవింగ్ కు సంబందించిన ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలని చెప్పారు. అభ్యర్థులు ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు జిరాక్స్​ కాపీలను కూడా తీసుకురావాలని వాటిని పరిశీలించిన అనంతరం వచ్చే అర్హత పత్రంలో సంతకం చేయడంతో ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement