Saturday, April 27, 2024

తెలుగు వారికి కేంద్రం సంక్రాంతి కానుక.. కూత పెట్టనున్న సికింద్రాబాద్-విశాఖపట్టణం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల ప్రజల కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకనిస్తోంది. జనవరి 15న సికింద్రాబాద్ – విశాఖపట్టణం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రారంభించనున్నాను. షెడ్యూల్ ప్రకారం జనవరి 19న కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ పండగ సమయంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాలుగు రోజుల ముందే ఈ రైలును ప్రారంభించాలని భావించారు. 15వ తేదీ ఉదయం 10 గంటలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా దాదాపు 8 గంటల్లో విశాఖపట్టణం చేరుకోనుంది. ఇతర రైళ్లు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం చేరుకోవడానికి కనీసం 12 గంటలైనా సమయం పడుతుంది. వందే భారత్ రాకతో ప్రయాణికుల విలువైన సమయం ఆదా కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement