Sunday, April 28, 2024

ఉప్పాడ క‌నుమ‌రుగేనా…

కాకినాడ, ఆంధ్రప్రభ: ఉప్పాడ…సముద్ర తీరంలోని ఈ గ్రామం కొన్నాళ్లలో కనుమరుగు కానుంది. ఇప్పటికే ఈ గ్రామం లోని వందలాది ఎకరాల స్థలాల్లోని ఇళ్లను సముద్రం కబళించింది. మిగిలిన ఊరిని కూడా సముద్రం త్వరలోనే సముద్రం తనలో కలిపేసుకోనుందని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం, అదే విధంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లు స్పస్టం చేశాయి. ఒకప్పుడు ఉప్పాడ అందమైన కెరటాలు ఆహ్లాదకర వాతావరణంతో అందరికీ కనువిందు చేసేది. ఇక్కడి వాతావరణానికి పరిసరాలకు అందమైన కెరటాలకు పర్యటకు లు పరవశించిపోయేవారు. గతంలో ఇక్కడ అనేక చిత్రాల షూటింగ్‌లు కూడా జరిగాయి. కోస్టల్‌ రీసెర్చ్‌ నేషనల్‌ సెంటర్‌ అధ్యయనం ప్రకారం1990 మరియు 2016 మధ్య భారత తీరప్రాంతంలో మూడవ వంతు భూమి కోతకు గురైంది. సముద్రం ఉధృతంగా ఉండటంతో తూర్పు తీరం మరింతగా కోతకు గురయ్యే అవకాశం ఉందని ఈ అధ్యయనం కనుగొంది.

కాకినాడ జిల్లాలోని ఉప్పాడకు కోత ప్రమాదం అధికంగా ఉందని కూడా ఈ సర్వే నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ పరిశోధకుల అధ్యయనం ప్రకారం కూడా ఉప్పాడ తీరప్రాంతం 1989 నుండి 2018 మధ్య ఏటా సగటున 1.23 మీటర్ల కోతకు గురవుతోంది. గత నాలుగు దశాబ్దాలలోనే ఈ గ్రామం 126.7 ఎకరాల భూమిని సముద్రకోత కారణంగా కోల్పోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొండంగి నుంచి అంతర్వేది వరకు 50కి పైగా మత్స్యకార గ్రామాలున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం యూ కొత్తపల్లి మండలంలో పదికిపైగా మత్స్యకార గ్రామాలున్నాయి. వీటిలోఒకప్పుడు ఉప్పాడే పెద్దది. కానీ ఇప్పటికే సముద్రం ముందుకు రావడంతో ఈ గ్రామం సగం సముద్రంలో కలిసిపోయింది. గతంలో గ్రామంలో ఒక పెద్ద శివాలయం, ఒక గెస్ట్‌ #హౌస్‌ ఉండేవి. ఇప్పుడు వాటి ఆనవాళ్లు కూడా నేడు కనపడటం లేదు.తాజాగా సముద్రం మరింత ముందుకు వస్తుందని, దీనివల్ల ఉప్పాడ కనుమరుగేయే ప్రమాదం ఉందని కేంద్రం ##హచ్చరించింది.
గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు తీరం వెంబడి జియో ట్యూబ్‌ వాల్‌ నిర్మించారు. ఇది కొంత మేర కోతను అరికట్టగలిగింది అయితే దాని నిర్వ#హణను గాలికి వదిలేసారు. దీంతో తిరిగి రోడ్డు కోతకు గురైంది. ఈ ప్రభావంతో ఇప్పటికే పలు ఇళ్లు కూలిపోయాయి. సగం గ్రామం సముద్రంలో కలిసిపోయింది. ఇప్పటికీ ఇంకా కేవలం సగం గ్రామం మాత్రమే మిగిలి ఉంది. కేంద్ర ##హచ్చరికలతో ప్రస్తుతం ఉప్పాడ మత్స్యకారుల్లో ఆందోళన పెరిగింది. కేవలం అర కిలోమీటర్‌ ముందుకు వస్తే ఈ గ్రామం మాయమైపోతుంది. చూడ్డానికి కనపడదు. కేవలం చరిత్ర పుటల్లో మాత్రమే ఉప్పాడను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే స్థాయికి ఎదిగిన సైంటిస్టులు ఇప్పటికీ ప్రకృతిని అడ్డుకోగలిగే నైపుణ్యత సాధించలేకపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకార గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఉప్పాడ వద్ద జియో ట్యూబు వాల్‌ పునర్నిర్మాణం చేపడితే కొంతవరకు లాభం ఉంటుందని స్థానికులు చెప్తున్నారు.
ఒకప్పుడు 342.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండే పాత గ్రామం గత వందేళ్లలో 320 ఎకరాలు కోతకు గురైంది. 410 ఎకరాల్లో సరుగుడు తోటలు, పంట పొలాలు ఉండగా, 320 ఎకరాల భూమి కొట్టుకుపోయింది. తీరం నుంచి కిలో మీటరు మేర సముద్రం చొచ్చుకుని వచ్చింది. సముద్ర కోత వల్ల మత్స్యకారులు అధికంగా నష్టపోతున్నారు. వారితోపాటు పలువురి ఇళ్లు కోతకు గురికావడంతో గ్రామంలో పడమరవైపు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పాత ఉప్పాడ గ్రామం చాలా వరకు కనుమరుగైంది. దాని స్థానంలో కొత్త గ్రామం పుట్టుకు వచ్చింధి.. కాకినాడ నుంచి సముద్ర తీరంలో నిర్మించిన బీచ్‌ రోడ్డు ఇప్పటి వరకు 32 సార్లకు పైగా కోతకు గురైంది.
ఉప్పాడ కోతకు ప్రధాన కారణం సమీపంలో ఉన్న #హూప్‌ ఐలెండ్‌. కాకినాడ పోర్టుకు, నగరానికి సముద్రం నుంచి రక్షణ కవచంగా ఉన్న ఈ #హూప్‌ ఐలెండ్‌ ఉప్పాడ కోతకు కారణమవుతుంది. దీనిని శాస్త్రవేత్తలు 1950లోనే గుర్తించారు. #హూప్‌ ఐలెండ్‌ కారణంగా కాకినాడ పోర్టు సమీపంలో కెరటాలు ఉండవు. తీరానికి చేరే కెరటాలు ఉధృతి ఉప్పాడను తాకుతుంది. ఈ కారణంగా కాకినాడ-వాకలపూడి నుంచి ఉప్పాడ గ్రామం దాటే వరకు కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. #హూప్‌ఐలెండ్‌కు సమీపంలోనే గోదావరి నదీపాయలు సముద్రంలో కలుస్తాయి. గోదావరి ద్వారా కొట్టుకు వచ్చే ఇసుక #హూప్‌ ఐలెండ్‌ సమీపంలో ఇసుక మేటలు వేస్తున్నాయి. ఇదే సమయంలో ఉప్పాడ వద్ద కోతకు గురవుతుంది. అలాగే కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో పెద్ద పెద్ద నౌకలు వచ్చేందుకు వీలుగా తరచూ డ్రెజ్జింగ్‌ చేస్తుంటారు. వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తొలగిస్తున్నారు. డ్రెడ్జింగ్‌ తరువాత సముద్రలోతున తిరిగి ఇసుక స#హజంగా పూడుకుపోతుంటుంది. ఈ ఇసుక ఉప్పాడ సమీపం నుంచి డీప్‌ వాటర్‌ పోర్టు వరకు కొట్టుకుని వస్తుండడం వల్ల ఇక్కడ కెరటాల ఎగిసిపడడంతో పాటు సముద్రం చొచ్చుకుని వెళ్లడం వల్ల కూడా ఉప్పాడ కోతకు కారణమువుతొంది.ఉప్పాడ సముద్రకోత నివారణకు కోతకు గురవుతున్న ప్రాంతంలో ఏటా ఇసుక వేయాలని నిర్ణయించారు. అలా చేయడం వ్యయప్రయాసాలతో కూడుకున్న అంశం కావడంతో దాని స్థానంలో రూ.31 లక్షలతో రక్షణ గోడ నిర్మించారు. అది కూడా కొట్టుకుపోయింది. దీనితో వైఎస్సార్‌ హాయాంలో జియోట్యూబ్‌ను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ సూచన మేరకు నిర్మించారు. ఇందుకు రూ.12 కోట్ల నిధులను వైఎస్సార్‌ మంజూరు చేశారు. తొలి రోజుల్లో కోత చాలా వరకు తగ్గింది. తరువాత దీనిని పట్టించుకునేవారు లేకపోవడంతో ఇది కూడా నిరుపయోగంగా మారింది. ఇక్కడ కోత తీవ్రతను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మో#హన్‌రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లగా, కేంద్ర బృందం పరిశీలనకు వచ్చింది.కానీఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఈ సమయంలో కేంద్రం చేసిన ప్రకటన స్థానికుల్లో తీవ్ర అందోళన కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement