Sunday, May 12, 2024

విశేషంగా ఆకట్టుకునే సినిమా

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ నిర్మిస్తునన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మా తగా వ్యవహరిస్తున్నారు. యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కశ్మీర హీరో యిన్‌ గా నటించింది. ఈ సినిమా నుండి విడుదలై న పాటలు, టీ-జర్‌ అన్ని మంచి అంచనాలను నెల కొల్పాయి. తాజాగా విడుదల చేసిన -టైలర్‌ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెం బర్‌ నైబ రింగ్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న థియేటర్స్‌ లో విడు దల చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్‌ లో భాగంగా చిత్ర బృందం సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది.


బన్ని వాస్‌ మాట్లాడుతూ రీసెంట్‌గా సినిమా చూశాం. స్మోకింగ్‌ ప్రకటన లేకుండా వస్తున్న చిత్రమిది. అంటే అంత క్లీన్‌గా ఉంటుంది ఈ సినిమా. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఉన్నాయి. ఇది థ్రిల్లింగ్‌ కుటుంబకథా చిత్రం అని చెప్పారు. హీరో కిరణ్‌ అబ్బవరంతో పాటు మా టీమ్‌ అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ప్రీ రిలీజ్‌ వేడుకకు అక్కినేని అఖిల్‌ అతిథిగా హాజరవుతున్నారని అని పేర్కొన్నారు. కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ఈ సినిమా కు అంతటా పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి. ఈ చిత్రంతో విజయం సాధించబోతున్నాం అని అందరూ అంటున్నారు.
ఒక మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది అని హీరోయిన్‌ కశ్మీర పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement