Friday, April 26, 2024

భయపెడుతున్న భూకంపాలు

ఇటానగర్ : భూకంపాలు వ‌ణికిస్తున్నారు. ఇండోనేషియాలో ప‌లు చోట్ల భారీ భూకంపం రావ‌డంతో 160 కి పైగా ప్ర‌జ‌లు మృతి చెందారు. భార‌త్ లో కూడా ప‌లు చోట్ల వ‌రుస‌ భూకంపాలు సంభ‌విస్తుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌కు గుర‌వుతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో తెల్ల‌వారు జామున‌ భూమి కంపించగా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని బాసర్‌లో ఉదయం 7 గంటలకు భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. బాసర్‌కు 58 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని పేర్కొన్నది. గోదావరి జన్మస్థలమైన నాసిక్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. నాసిక్‌కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ ఉపరితలం కింది టెక్టానిక్‌ ప్లేట్ల కదలిక వల్ల భూమికి దిగువన 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అధికారులు చెప్పారు. టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీలోని అంకారాలో బుధవారం ఉదయం 6.38 గంటలకు 6.0 తీవ్రతతో భూమి కంపించింది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement