Saturday, April 27, 2024

15 వేల మంది మ‌హిళ‌ల‌తో మెగా శారీ వాక‌థాన్ – (వీడియో, ఫోటోల‌తో)

సూర‌త్ – గుజరాత్ – సంస్కృతీ సంప్రదాయాలకు భారత్‌ పుట్టినిల్లు. మహిళల వస్త్రధారణలో చీరకున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చీరలో మహిళల అందం మరింత ద్విగుణీకృతమవుతుంది. చీర కట్టు వారికి హుందాతనాన్ని తెస్తుంది. పండుగలకు, పెళ్లిళ్లలో మహిళలు పలు రకాల చీరలు కట్టుకుని సందడి చేస్తుంటారు. సూరత్‌లో ఆదివారంనాడు ‘శారీ వాకథాన్‌’ పేరిట 15వేల మంది మహిళలు ఒకేసారి, ఒకేచోట చీరకట్టుతో దర్శనమిచ్చారు. డ్యాన్స్‌లు, పాటలతో హోరెత్తించారు. మహిళా సాధికారత, మహిళల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడం కోసం నిర్వాహకులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement