Sunday, May 12, 2024

లోక‌ల్ ట్రైన్ లో.. హీరోయిన్ సారా ఆలీఖాన్

సినీ సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా జ‌నంలోకి రారు..ఎందుకంటే సెల్ఫీల‌ని ఎగ‌బ‌డ‌తారు కాబ‌ట్టి. అయితే కొంత‌మంది ఏదో ఒక‌లాగా జ‌నం మ‌ధ్య‌లోకి వ‌స్తుంటారు..ఆటోల‌లో ప్ర‌యాణం చేస్తుంటారు. రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌ ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించారు. అస‌లే స్టార్ కిడ్. ఇందుకు సంబంధించిన వీడియోను నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో తన టీంతో కలిసి ఇలా లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణం చేసినట్లు తెలిపారు. కాగా, ట్రైన్‌ దిగిన అనంతరం కూడా సారా ఆటోలో ప్రయాణం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోందిద‌. ట్రైన్ లో ప‌లువురికి సెల్ఫీలు కూడా ఇచ్చింది ఈ బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement