Friday, May 17, 2024

ఫ్యామిలీతో అమెరికా ట్రిప్ వేసిన ఎన్టీఆర్.. ఎయిర్ పోర్ట్ లో ఫొటోల‌కి ఫోజులు

ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో ఓ సినిమాలో న‌టించ‌నున్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. స్క్రిప్ట్‌ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మార్పులు చేస్తున్నార‌ట కొర‌టాల‌శివ‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఇటీవలే అనురుధ్‌తో కలిసి మ్యూజిక్‌ సిట్టింగ్స్ కూడా వేశాడు. అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్‌టీఆర్‌ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. దాంతో తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేశారు స్టార్ హీరో ఎన్టీఆర్. ఓ వారం రోజుల పాటు అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేయాలని ప్లాన్ చేసుకున్నార‌ట. ఈ మేరకు భార్య, పిల్లలతో కలిసి వేకేషన్‌కు పయనమయ్యారు. తాజాగా ఆయన ఏయిర్‌పోర్ట్‌లో తన ఫ్యామిలీతో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తారక్‌ తన భార్య ప్రణతి, కొడుకులు భార్గవ్‌ రామ్‌, అభయ్‌ రామ్‌లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement