Saturday, May 4, 2024

రాజ్ భ‌వ‌న్ ముందు ఆర్టీసీ కార్మికులు ధ‌ర్నా… న‌గ‌రంలో నిలిచిన బ‌స్సు స‌ర్వీసులు

హైదరాబాద్‌: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ తమిళిసై సంత‌కం చేయ‌కుండా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ నిలిపివేయ‌డాన్ని నిర‌సిస్తూ ఆర్టీసీ కార్మికులు రాజ్ భ‌వ‌న్ ముందు భైఠాయించారు.. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ పిలుపుమేరకు హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుకు భారీగా చేరుకున్న కార్మికులు.. నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో ర్యాలీగా గవర్నర్‌ అధికార నివాసానికి చేరుకున్నారు. రాజ్‌భవన్‌ గేటు ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నారు. గవర్నర్‌ తమిళిసైకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. వెంటనే బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ బిల్లును వెంటనే గవర్నర్‌ వెంటనే ఆమోదించాలని ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. బిల్లును కేబినెట్‌ ఆమోదించిందని, సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ చర్యలు చేపట్టాలన్నారు.

ఇది ఇలా ఉంటే నేటి ఉదయం రెండు గంటలపాటు బస్సులు బంద్‌చేసి డిపోల ముందు కార్మికులు నిర‌స‌న తెలిపారు.. రెండు గంట‌ల పాటు కార్మికులు నిరస‌న చేసిన‌ప్ప‌టికీ అనేక ప్రాంతాల‌లో ఇంకా బ‌స్సు స‌ర్వీస్ లు ప్రారంభం కాలేదు.. జంట‌న‌గ‌రాల‌లోని అనేక బ‌స్సులు డిపోల‌కు ప‌రిమితం కావ‌డంతో ప్ర‌యాణీకులు ఇబ్బంది ప‌డుతున్నారు.. నేటి మ‌ధ్యాహ్నానికి స‌ర్వీస్ లు క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తామ‌ని ఆధికారులు చెపుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement