Friday, April 26, 2024

పెరిగిన బంగారం…వెండి ధరలు -ఎంతో తెలుసా ?

మగువలకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో బంగారం కు ఉన్న డిమాండ్ కూడా బాగా ఎక్కువ.గత కొన్ని రోజులుగా బంగారం ధరలు…తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. కాగా తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి రావటంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 48,550 కు చేరగా.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 44,500 కు చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1900 పెరిగి రూ. 76,100 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement