Sunday, April 28, 2024

8బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా..

నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరఢా ఝులిపిస్తోంది. బ్యాంకులకు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తోంది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, మణిపూర్‌, గుజరాత్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలోని ఎనిమిది సహకార బ్యాంకులపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ రూ. 12 లక్షలకు పైగా జరిమానా విధించింది. ప్రుడెన్షియల్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఎక్స్‌పోజర్‌ పరిమితిని పాటించనందుకు, ప్రుడెన్షియల్‌ ఇంటర్‌బ్ఖ్యాంక్‌ కౌంటర్‌పార్టీ పరిమితిని పాటించడంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లోని నాబాపల్లి కోఆపరేటివ్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ అత్యధికంగా రూ. 4లక్షల జరిమానా విధించింది.

మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఫైజ్‌ మెర్కెంటైల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ నిబంధనలను ఉల్లంఘించి డైరెక్టర్‌ బంధువుకు రుణం మంజూరు చేసినందుకు రూ. 25,000 జరిమానా విధించింది. జరిమానా విధించిన ఇతర బ్యాంకుల్లో మధ్యప్రదేశ్‌లోని జిలా స#హకార కేంద్రీయ బ్యాంక్‌ మర్యాడిట్‌, మహారాష్ట్రలోని అమరావతి మర్చంట్స్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌, మణిపూర్‌లోని మణిపూర్‌ ఉమెన్స్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌, ఉత్తరప్రదేశ్‌లోని యునైటెడ్‌ ఇండియా కోఆ్ఖపరేటివ్‌ బ్యాంక్‌, బాఘత్‌ అర్బన్‌ కోఆ్ఖపరేటివ్‌ బ్యాంక్‌ ఉన్నాయి. హర్యానా, గుజరాత్‌లోని నవనిర్మాణ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. ఈ బ్యాంకులపై రూ.లక్ష జరిమానా విధించారు. అర్హత లేని డిపాజిట్‌లను డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌కి బదిలీ చేయకపోవడం, మోసాలను నివేదించడంలో జాప్యం, అసురక్షిత రుణాలను మంజూరు చేయడం తదితర నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement