Friday, May 3, 2024

క్షీణించిన బంగారం ధరలు..

బంగారం ధరలు భారీగా క్షీణించాయి. మల్టి కమోడిటీ ఎక్ఛేంజీ(ఎంసీఎక్స్‌)లో 10 గ్రాముల బంగారం ధర రూ.500తగ్గి రూ.51,715 వద్ద నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా, బంగారం ధరలు ఒక వారానికి పైగా కనిష్టస్థాయికి పడిపోయాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీని పెంచడానికి ముందు అమెరికా ఆదాయం పెరగడం, పెట్టుబడుదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి కారణాల చేత బంగార ధరలు తగ్గాయి.

ప్రపంచ ధరలకు అనుగుణంగా భారతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఒక్కరోజులో సుమారు రూ.500కి పైగా బంగారం ధర తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లిలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్‌ గోల్డ్‌ 999) బంగారం ధర సుమారు రూ.500కి పైగా తగ్గి రూ.51,564కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల (916) బంగారం ధర రూ.47,771 నుంచి రూ.47,233కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.48,100 నుంచి రూ.47,600కు తగ్గింది. ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.540 తగ్గి రూ.51,930కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. వెండి ధర రూ.1900కి పైగా తగ్గి రూ.67,349కి చేరుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement