Friday, April 26, 2024

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఇంట్లో విషాదం

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పేస‌ర్ చేత‌న్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కొన్ని రోజులు క్రితం క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డ చేత‌న్ స‌కారియా తండ్రి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ్‌మెంట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. చేత‌న్ స‌కారియా తండ్రి మృతికి ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ తీవ్ర సంతాపం వ్య‌క్తంచేసింది. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేసింద

ఈ ఏడాది క‌రోనా వ‌ల్ల అర్ధాంత‌రంగా నిలిచిపోయిన ఐపీఎల్ సీజ‌న్-14లో చేత‌న్ స‌కారియా ఏడు వికెట్లు తీశాడు. ఇటీవ‌లే టోర్నీ ఆగిపోవ‌డం, ఇప్పుడు తండ్రి క‌రోనా కాటుకు బ‌లికావ‌డం స‌కారియాకు తీవ్ర మ‌నోవేద‌న‌ను మిగిల్చాయి. స‌కారియా సోద‌రుడు కూడా నాలుగు నెల‌ల క్రిత‌మే మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement