Sunday, May 5, 2024

రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ టీజర్ విడుదల

యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్‌కు మంచి క్రేజ్ ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ, కుమారి 21F చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం నాడు హీరో రానా చేతుల మీదుగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాతో సంతూ మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందించాడు.

ఈ మూవీలో డిఫరెంట్ లుక్‌తో రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. ముఖ్యమైన పాత్రల్లో ఇంద్రజ, మురళీ శర్మ నటించారు. కాగా ఇటీవల రాజ్‌తరుణ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇద్దరి లోకం ఒక్కటే, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే సినిమాలు నిరాశపరచడంతో ఈ మూవీతో బంపర్ హిట్ కొట్టాలని రాజ్ తరుణ్ ఆరాటపడుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: మిల్కీ బ్యూటీ డ్యాన్స్ చూస్తే మతి పోవాల్సిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement