Friday, April 26, 2024

మిల్కీ బ్యూటీ డ్యాన్స్ చూస్తే మతి పోవాల్సిందే

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పిన తక్కువే. అందం, నటన, చురకైన డ్యాన్స్ స్టెప్పులతో అందరి మనస్సుల్లో మంచి స్థానం సంపాదించుకుంది. తమన్నాకు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. లేటు వయసులో తన అందంతో ప్రేక్షకుల మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్ షోతో అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. గ్లామరే కాదు.. డ్యాన్స్ లోనూ ఈ పాపకి ఎవరూ సాటిరారు. లెటెస్ట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టా లో పెట్టిన వీడియోకి ఫ్యాన్స్ దాసోహమంటున్నారు. నడుమును స్ప్రింగ్ లా తిప్పేస్తూ.. కుర్రకారు గుండెల్ని గిరా గిరా తిప్పేస్తుంది. ‘కిస్ మీ మోర్’ అనే పాటకు తమన్నా వేసిన స్టెప్పులు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే. కొరియోగ్రాఫర్ షజియా సమ్జీతో కలసి హుషారైన స్టెప్పులతో తమన్నా చేసిన డ్యాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: బాలయ్య సినిమాలో రకుల్ ?

Advertisement

తాజా వార్తలు

Advertisement