Friday, May 3, 2024

బాలయ్య సినిమాలో రకుల్ ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లతో బాలకృష్ణ సినిమాలు చేయబోతున్నాడు. వీటితో పాటు శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలయ్య సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో శ్రీవాస్ బాలయ్య కాంబినేషన్ లో డిక్టేటర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement