Saturday, May 18, 2024

దాదా ఇంటికెళ్లి బర్త్ డే విషెస్ చెప్పిన దీదీ..

టీమిండియా మాజీ కెప్టెన్..ప్రస్థుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నిన్న తన 49వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అయితే సౌర‌వ్ గంగూలీకి గురువారం త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ ఊహించ‌ని బ‌హుమానం ల‌భించింది. అప్ప‌టి వ‌ర‌కూ సింపుల్‌గా ఇంట్లోనే త‌న బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్న దాదా ద‌గ్గ‌రికి సాయంత్రం 5 గంట‌ల ప్రాంతంలో దీదీ వ‌చ్చారు. గులాబీల బొకే, స్వీట్ల‌తో త‌న ఇంటికి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని దాదా సాద‌రంగా ఇంట్లోకి ఆహ్వానించారు. అంతేకాదు ఆమె తిరిగి వెళ్లేట‌ప్పుడు గంగూలీ కూడా ఓ రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌డం విశేషం. ఇక మ‌మ‌తా అలా వెళ్లిపోయారో లేదో వెంట‌నే రాజ్‌భ‌వ‌న్ నుంచి కూడా బ‌ర్త్‌డే విషెస్ చెబుతూ దాదాకు ఓ బొకే వ‌చ్చింది.

ఇది కూడా చదవండి: రేవంత్ రాకతో కేసీఆర్ వెన్నులో వణుకు

Advertisement

తాజా వార్తలు

Advertisement