Thursday, May 2, 2024

Rain alert : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి నేడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల నేడు, రేపు ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు, లేదంటే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారులు.. రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement