Friday, April 26, 2024

అదాని- మోడీల‌పై ప్ర‌శ్నించే నా గ‌ళాన్ని నొక్కేందుకే బ‌హిష్క‌ర‌ణ వేటు….రాహుల్ గాంధీ..

ఢిల్లీ : పారిశ్రామికవేత్త అదాని వ్యాపార సామ్రాజ్య అక్ర‌మాల‌పై తాను ప‌దేప‌దే ప్ర‌శ్నిస్తున్నందు వ‌ల్ల‌, అదాని, మోడీ స్నేహంపై ఆధారాల‌తో స‌హ వెల్ల‌డి చేస్తున్నందుకే త‌న‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు వేశార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.. ఢిల్లీలోని ఎఐసిసి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతోమాట్లాడుతూ, తాను బ‌హిష్క‌ర‌ణ‌ల‌కు, జైళ్ల‌కు బ‌య‌ప‌డ‌న‌ని, ఎప్పుడు నిజాలేమాట్లాడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు.. అదాని,మోడీ సంబంధాల‌పై ప్ర‌శ్న‌లు నిత్యం వేస్తుంటాన‌ని తేల్చి చెప్పారు.. జీవిత‌కాలం బ‌హిష్క‌రించినా, జీవితాంతం జైలులో ఉంచినా ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు కోసం గ‌ళం విప్పుతూ ఉంటాన‌ని అన్నారు.. అలాగే కోర్టు తీర్పుపైనా, ఆయ‌న మాట్లాడేందుకు ఆయ‌న తిర‌స్క‌రించారు. కాగా,బిజెపి పాల‌న‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అదానీ, మోడీ స్నేహం గురించి పార్లమెంట్లో మాట్లాడానన్నారు. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరు పెట్టారని ప్రశ్నించారు. అదాని వ్యవహారంపై నిలదీస్తే దేశంపై తాను దాడి చేస్తున్నట్లుగా బిజెపి చిత్రీకరిస్తున్నదని అన్నారు.


‘‘ అదానీ వ్యవహారంలో ఆధారాలను నేను పార్లమెంట్లో అందజేశాను. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరు పెట్టారు? నా గురించి కేంద్ర మంత్రులు పార్లమెంటులో అబద్ధాలు చెప్పారు. గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచే అదానీతో మోడీకి సంబంధాలున్నాయి. లోక్‌సభలో నా ప్రసంగాన్ని కేంద్రం కావాలనే తొలగించింది. నిబంధనలు ఉల్లంఘించిన అదానికి ఎయిర్‌పోర్టులు కట్టబెట్టారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు ఎవరు పెట్టారు? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అదానీ వ్యవహారంలో స్పీకర్‌కు అన్ని ఆధారాలు ఇచ్చా. లండన్‌ ప్రసంగంపై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు నాకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు. నేను ఎవ్వరికీ భయపడను. నాపై అనర్హత వేటు వేసినా జైలుకు పంపినా తగ్గేదేలే, ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేసేది లేదు. నాకు జైలు శిక్షా..? ఐ డోంట్ కేర్.. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా అంతా జరుగుతోంది. ప్రజల్లోకి వెళ్లడమొక్కటే ఇప్పుడు విపక్షాలకున్న ఒకే ఒక్క అవకాశం’’ అని పేర్కొన్నారు. అలాగే త‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ప్ర‌తిప‌క్షాల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. అలాగే ఇక ముందు విప‌క్షాల‌తో క‌ల‌సి ముందుకు సాగుతామ‌ని అన్నారు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై పోరాడేందుకు విప‌క్షాలు క‌ల‌సి రావాల‌ని పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement