Friday, March 15, 2024

మొగుల్లపల్లి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోం మంత్రి

మొగుళ్లపల్లి(భూపాలపల్లి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.10 కోట్ల వ్యంతో మొగుళ్ళపల్లి, టేకుమట్ల, కాళేశ్వరం, పలిమేలలో నిర్మించిన పోలీస్ స్టేషన్ నూతన భవలాలను శనివారం హోం మంత్రి మహమూద్ అలీ, స్థానిక శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్మెన్ లు, జక్కు శ్రీహర్షిని, గండ్ర జ్యోతి, రాష్ట్ర డీజీపీ అంజనికుమార్, ఓఎస్డీ గౌస్ ఆలం ,భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రాలతో కలిసి ప్రారంభించారు. ముందుగా మొగుల్లపల్లి చేరుకున్న మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

మొగుల్లపల్లిలో 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని వేదపండితుల మంచోచ్ఛరణలు మధ్య సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం టేకుమట్లలో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించి అక్కడి నుండే కాళేశ్వరం, పలిమేల పోలీస్ స్టేషన్ లను ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్ దివాకర, అదనపు ఎస్పీ శ్రీనివాసులు, డిఎస్పీలు రాములు, రామ్ మోహన్ రెడ్డి, చిట్యాల సీఐ వేణు చందర్ , ఎస్సైలు జాడి శ్రీధర్, చల్ల రాజు, క్రిష్ణ ప్రసాద్, అభినవ్,రామకృష్ణ, జిల్లాలోని వివిధ సర్కిల్ ల సిఐ లు, ఎస్సై లు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement