Saturday, April 27, 2024

బిజెపి నేత‌ల‌కు ప్లైయింగ్ కిస్ లు ఇచ్చిన రాహుల్ గాంధీ.. వైర‌ల్ గా వీడియో

రాజ‌స్థాన్ లో భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. కాగా ఝులావార్‌లోని యాత్రలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అక్కడ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ బీజేపీ ఆఫీస్ దాటుతుండగా ఆ భవనంపై ఉన్న బీజేపీ కార్యకర్తలకు ..రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చారు. వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. ఆ సమయంలో రాహుల్ గాంధీతోపాటు సీఎం అశోక్ గెహ్లట్, ఆర్‌పీసీసీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దోటస్రా, సచిన్‌ పైలట్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అయితే బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజునే… ఈ విధంగా రాహుల్ గాంధీ ముద్దుల వర్షం కురిపించడం.. ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ముద్దుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement