Friday, April 26, 2024

ఏపీ సీఎం జగన్‌పై ఆర్.నారాయణమూర్తి ప్రశంసల వర్షం

ఏపీ సీఎం జగన్‌పై ప్రముఖ సీనియర్ నటుడు, విప్లవాత్మక సినిమాల నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ మొత్తం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోయిందని… ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోను ఆయన స్వాగతించారు. చిన్న సినిమాలను బతికించేలా నిర్ణయం తీసుకున్న జగన్‌కు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.

ఎందరో చిన్న నటీనటులకు, చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆశాకిరణంగా మారిందన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరికే పరిస్థితి కూడా లేదన్నారు. చిన్న సినిమా బాగుంటేనే సినీ పరిశ్రమ బాగుంటుందని ఆర్.నారాయణమూర్తి అన్నారు. తాను నిర్మించిన ‘రైతన్న’ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోందని ఆయన వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్

Advertisement

తాజా వార్తలు

Advertisement