Thursday, April 25, 2024

భీమ్లా నాయక్ తో పనిచేయడం అద్భుత అవకాశం…!!

సితార ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 12 పై పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు, సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరోవైపు ఎస్ఎస్ తమన్… సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ కు రీమేక్ చిత్రం.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లతో పనిచేయడం అద్భుత అవకాశం అని పవన్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ ను డిఫరెంట్ స్టిల్స్ లో చూపిస్తా అంటూ చెప్పుకొచ్చాడు రవి కె చంద్రన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement