Wednesday, May 8, 2024

రేపే నా రెండో వివాహం – ట్వీట్ చేసిన పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్

తాను రెండో వివాహం చేసుకోనున్న‌ట్లు తెలిపారు పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్. వైద్యురాలు అయిన డాక్టర్ గుర్ ప్రీత్ కౌర్ ను భగవంత్ రెండో వివాహం చేసుకోనున్నారు.ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ఛండీగ‌ఢ్‌లోని త‌న నివాసంలో జ‌రిగే ఈ వివాహ వేడుక‌కు ఆప్ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స‌హా ప‌లువురు పార్టీ ముఖ్యులు హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం. ఆప్ లో చేరిన త‌ర్వాత ఆరేళ్ల క్రిత‌మే భ‌గ‌వంత్ మాన్ త‌న మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చారు. ఆరేళ్లుగా వివాహం అనే మాటే ఎత్త‌కుండా సాగిన భ‌గ‌వంత్ తాజాగా పంజాబ్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అన‌తి కాలంలోనే రెండో పెళ్లి చేసుకుంటూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement