Saturday, April 27, 2024

మూడో టెస్టులో టీమిండియా పోరాటం.. ఎంతవరకు? ఎప్పటి వరకు?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 78 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా రెండో ఇన్నింగ్సులో పోరాడుతోంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 354 పరుగుల భారీ ఆధిక్యం సమర్పించడంతో భారత్ ఓటమి దాదాపు ఖరారైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (8) వికెట్ కోల్పోయినా రోహిత్ (59), పుజారా (91 బ్యాటింగ్), కోహ్లీ (45 బ్యాటింగ్) నిలబడటంతో మూడో రోజు భారత్‌ ఇంగ్లండ్‌పై పైచేయి సాధించింది.

కాగా ఈ టెస్టులో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇంకా ఇంగ్లండ్ కంటే భారత్ 139 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎంతవరకు, ఎప్పటివరకు తమ పోరాటం కొనసాగిస్తారన్న అంశంపైనే ఈ టెస్టు ఫలితం ఆధారపడి ఉంది. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ టెస్టును కాపాడుకుంటే మిగతా రెండు టెస్టుల్లో ఒక మ్యాచ్ గెలిచినా సిరీస్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ టెస్టు భారత్ చేజారితే మిగిలిన రెండు టెస్టుల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఏదేమైనా ఈ టెస్టులో పుజారా, కోహ్లీ, రహానెలు సెంచరీలతో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ వార్త కూడా చదవండి: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement