Monday, April 29, 2024

త్వరలోనే ఏపీ సీఎం జగన్ బయోపిక్.. 2024 ఎన్నికలకు ముందు విడుదల

ఏపీ సీఎం జగన్‌ జీవితంపై బయోపిక్ రాబోతున్నట్లు తెలుస్తోంది. జగన్ జీవితంలో ఎత్తుపల్లాలు.. ఆయన అనుభవించిన కష్ట సుఖాలు ఇంకా జైలు జీవితం.. ఆ తర్వాత భారీ మెజారిటీతో సీఎం పదవిని అధిష్టించడం.. ఇలా జగన్ జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందని భావించిన సినిమా దర్శకుడు మహి వి.రాఘవ ఆయన బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.

గతంలో మహి.వి.రాఘవ జగన్ తండ్రి వైఎస్ఆర్ బయోపిక్‌ను కూడా తెరకెక్కించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక జగన్ బయోపిక్‌లో హీరోగా ప్రతీక్ గాంధీ నటించనున్నట్లు తెలుస్తోంది. స్కామ్ 1992 అనే వెబ్ సిరీస్‌తో ప్రతీక్ గాంధీ దేశం మొత్తం పాపులర్ నటుడిగా మారాడు. అతడు ఇంచుమించు జగన్ పోలికలతో ఉంటాడు. దీంతో ఆయన అయితే ఖచ్చితంగా సరిపోతుందని భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కనున్నట్లు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మూవీ విడుదల కానున్నట్లు టాక్.

ఇది కూడా చదవండి: ‘భీష్మ’ను మించిన ‘రంగ్‌దే’

Advertisement

తాజా వార్తలు

Advertisement