Thursday, April 18, 2024

సుమన్ మద్దతు కూడా ప్రకాష్ రాజ్ కే!

మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కో వివాదం తెరపైకి వస్తోంది. ఇప్పటికే ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజు, మంచు విష్ణు, నటి హేమ, అలాగే జీవిత రాజశేఖర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటికే లోకల్ నాన్ లోకల్ అంటూ ఓ వివాదం తలెత్తింది. ప్రకాష్ రాజ్ లోకల్ కాదని ఇక్కడ పోటీ చేయడానికి వీలులేదని ఓ అంశాన్ని లేవనెత్తారు కొంతమంది. అయితే మా లో సభ్యత్వం ఉన్న ఎవరైనా పోటీ చేయవచ్చని మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలిచింది.

ఇప్పటికే నాగబాబు వంటి స్టార్స్ వచ్చి ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచారు. తాజాగా మరో సీనియర్ నటుడు నుంచి ప్రకాశ్ రాజ్ కి మద్దతు లభించింది. అలనాటి హీరో సుమన్ ప్రకాష్ రాజ్ కి మద్దతు ప్రకటించారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ప్రకాష్ రాజు అర్హుడని ఆయన స్థానికేతరులు కాదని చెప్పుకొచ్చారు. నటీనటులు అన్ని రాష్ట్రాల వారని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement