Sunday, May 12, 2024

రేపే పాలిసెట్‌ పరీక్ష.. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష ఈరోజు జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో వచ్చే ర్యాంకును బట్టి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లను కల్పించనున్నారు.

ఈ పరీక్షకు నిమిషయం నిబంధనను అధికారులు అమలు చేయనున్నారు. పరీక్ష నిర్వహణకు 296 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,05,656 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులను అధికారులు సూచించారు. నిమిషయం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement