Wednesday, May 8, 2024

గాంధీలో మూడంచెల భద్రత.. అవసరమైతే మరింత పెంచే చాన్స్..

ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు సాధారణ వైద్య సేవలు అందించాల్సి రావడంతో వైద్యులు, సిబ్బంది రక్షణ కోసం గాంధీ ఆసుపత్రిలో కట్టుదిట్టమైన పోలీస్‌ భద్రతను కల్పించారు. ఆసుపత్రిలో మూడంచెల భద్రతతో నార్త్‌ జోన్‌ పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో పికెట్స్‌ పెంచారు. కరోనా సేవల సమయంలో గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని పోలీస్‌ భద్రత పెంచారు. నార్త్‌ జోన్‌ అడిషనల్‌ డీసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో భద్రత పర్యవేక్షణ కొనసాగుతోంది. షిఫ్ట్‌ల వారీగా పోలీసు విధులు, ప్రతి షిఫ్ట్‌లో 35 మంది పోలీసులు మొత్తం 150 మందికిపైగా పోలీసులు మోహరించేలా ఏర్పాట్లు చేశారు.

అవసరమైతే భద్రతను మరింత పెంచే యోచనలో పోలీస్‌ కమిషనర్‌ ఉన్నారు. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు సీఐ, 25 మంది ఎస్సైలతో కానిస్టేబుల్‌, హోంగార్డులతో భద్రత పర్య వేక్షణ కొనసాగుతోంది. ఆసుపత్రిలో భద్రత కల్పించే విషయంలో నగర పోలీస్‌ కమిషనర్‌ సీపీ ఆనంద్‌తో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు మాట్లాడారు. కరోనా ఆపత్కాలంలో ప్రాణాలు లెక్క చేయకుండా సేవలందిస్తున్న వైద్యులకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూ, ఏఎంఎసీ వార్డు, మార్చురీ, ఓపీ బ్లాక్‌, జనరల్‌ వార్డు ఆసుపత్రి, ఎంట్రీ, ఎక్సిట్‌ ఆయా గేట్‌ల వద్ద ఔట్‌ పోస్టుల వద్ద పోలీసుల పికెట్‌ ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement