Wednesday, May 8, 2024

లైంగిక వేధింపుల కేసులో దిలీప్ కు ఊరట.. ఈ నెల 27వరకు అరెస్టు చేయొద్దన్న హైకోర్టు..

నటుడు దిలీప్‌కు కొంత ఊరటనిచ్చింది కేరళ హైకోర్టు. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించిన కుట్ర కేసులో నిందితులపై జనవరి 27 వరకు ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని కేరళ హైకోర్టు మధురై బెంచ్ పోలీసులను ఈరోజు ఆదేశించింది. లైంగిక వేధింపులపై దర్యాప్తు అధికారులను బెదిరించిన కేసులో దిలీప్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులను దెబ్బతీసేందుకు దిలీప్ కుట్ర పన్నారనేది కల్పితమని, విచారణాధికారులు, ప్రాసిక్యూషన్ తన క్లయింట్‌ను కటకటాల వెనక్కి నెట్టాలని నిర్ణయించుకున్నారని నటుడు దిలీప్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

సంఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత వారు ఇప్పుడు కొత్త కొత్త కల్పిత కథలను అల్లుతున్నారు. తమ కేసును రుజువు చేయడానికి నిజాలను నిరూపించాలి అని దిలీప్ తరపు న్యాయవాది వాదించారు. అయితే, ఈ కేసులో నిందితులందరూ గంటల తరబడి విచారణకు హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నారని డిఫెన్స్ లాయర్లు తెలిపారు. కాగా, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ కేసులో నటుడిని కనీసం ఐదు రోజుల పాటు ప్రశ్నించాల్సి ఉంటుందని ప్రాసిక్యూషన్ తెలిపింది. నిందితులను వేధించబోమని కూడా పేర్కొంది.

2017లో సినీ నటిపై జరిగిన లైంగిక వేధింపులపై విచారణ జరిపిన అధికారులపై దాడికి కుట్ర పన్నినట్లు దిలీప్ ఆడియో క్లిప్ ఆధారంగా దర్యాప్తు అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై జనవరి 9న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నటిపై దాడి కేసులో దిలీప్‌పై ఓ టీవీ చానెల్ ద్వారా దర్శకుడు బాలచంద్రకుమార్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించిన వెంటనే ఆడియో క్లిప్‌లు బయటకు వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పే జీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement