Saturday, April 27, 2024

ఒక శకం ముగిసింది.. మిల్కా మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోఒం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిల్కా మరణం తన హృదయాన్ని దు:ఖంలో నింపేసిందని రాష్ట్రపతి రామ్ నాథ్ అన్నారు. జీవితంలో మిల్కా ఎదుర్కొన్న కష్టాలు, ఆయన బలమైన వ్యక్తిత్వం.. భారత్ లో అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

మిల్కా జీవతం ఎందరికో స్ఫూర్తి అని ప్రధాని మోదీ అన్నారు. దేశం అతి విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయిందన్నారు. కోట్లాది మంది హృదయాల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారని చెప్పారు.

మిల్కా మరణంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఒక శకం ముగిసిందని అన్నారు. భారత్, పంజాబ్ కు తీరని నష్టం జరిగిందన్నారు. ఎన్ని తరాలైన ఆయన ఘనతలను దేశం స్మరిస్తూ ఉంటుందని అమరీందర్ తెలిపారు. కాగా, భారత దిగ్గజ అథ్లెట్  ప్లేయర్ మిల్కా సింగ్(91) కరోనాతో శుక్రవారం రాత్రి కన్నుమూసిన సంగి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement