Thursday, March 28, 2024

శేఖర్ కమ్ముల సినిమాకు ధనుష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

తమిళ స్టార్ హీరో ధనుష్ తో టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్రిభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాను లవ్ స్టోరీ చిత్ర నిర్మాతలు నిర్మిస్తుండటం విశేషం. ఎవరు ఊహించని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఒక్కసారిగా ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.

అయితే ఈ సినిమాకు ధనుష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియా లో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకు గాను ధనుష్ 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియ రావట్లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement