Saturday, April 27, 2024

స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు..

పెట్రో ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దాదాపు మూడు వారాల తరువాత తగ్గడం ఇదే తొలిసారి. గత నెల 27న చివరిసారి ఢిల్లీలో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి పెట్రో ధరలు చేరుకున్నాయి. పెట్రోలు ధర లీటర్‌కు రూ. 91.17కు చేరుకుంది. తాజాగా నేడు లీటరు పెట్రోలుపై 18 పైసలు తగ్గింది. దీంతో దేశ రాజధానిలో లీటరు రూ.90.99కి దిగొచ్చింది. డీజిల్‌పై 17 పైసలు తగ్గింది. ఫలితంగా ఇప్పుడు లీటర్ పెట్రోలు ధర రూ.81.30కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 94.61గా ఉండగా, డీజిల్ ధర రూ. 88.67గా ఉంది. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ.97.40, రూ.88.42గా ఉండగా, చెన్నైలో రూ.92.95, రూ.86.29గా, కోల్‌కతాలో రూ.91.18, రూ.84.14గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement