Sunday, May 5, 2024

చార్మినార్ సెట్ లో హరిహర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్,లుక్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ నెల 27 నుండి ఈ సినిమా షూటింగ్ చార్మినార్ సెట్ లో జరగబోతుందట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ లో వందల మంది పాల్గొన్న బోతున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం రీమేక్ లో కూడా పవన్ నటిస్తున్నారు. అలాగే పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement