Sunday, April 28, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్ డేకి-హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు గ్లింప్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నాలుగు సినిమాల‌ను లైన్ లో పెట్టాడు. అందులో ‘హ‌రి హ‌ర వీర మ‌ల్లు’ ఒక‌టి. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈ గ్లింప్స్‌కు ఓ స్టార్ హీరో వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు టాక్. ఈ వార్త‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement