Friday, April 26, 2024

మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టైన ముదురు ప్రేమ జంట న‌రేష్,ప‌విత్ర – వీడియోతో

నియర్ నటుడు నరేష్.. నటి పవిత్ర లోకేశ్ లు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు..కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తాము కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు గతేడాది డిసెంబర్ 31న నరేశ్ ప్రకటించారు. పవిత్రను ముద్దు పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను నరేశ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. తమకు పెళ్లి అయిన విషయాన్ని వెల్లడించారు. ‘ఒక పవిత్ర బంధం. రెండు మనసులు. మూడు ముళ్లు. ఏడు అడుగులు. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్ర నరేశ్’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement