Sunday, May 19, 2024

అంతర్జాతీయ స్థాయికి మన బ్యాంక్‌లు, కరెన్సీ చేరుకోవాలి : ప్రధానమంత్రి

అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలో దేశీయ బ్యాంక్‌లు కరెన్సీని భాగం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వీటిపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఢిల్లో సోమవారం నాడు జరిగిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమృత్‌ మహోత్సవ్‌ లోగోతో పాటు, 1, 2, 5,10,20 రూపాయల విలువ కలిగిన నాణాలను విడుదల చేశారు. ఇవి కేవలం స్మారక నాణాలు మాత్రమే కాదని, త్వరలోనే చలామణిలోకి వస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది. వీటిని అంథులు కూడా తేలికగా గుర్తించేలా తయారు చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను పురష్కరించుకుని విడుదల చేసిన ఈ నాణలు దేశాభివృద్ధి కోసం పని చేసేలా ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 12 ప్రభుత్వ పథకాలు అనుసంధానించిన జన సమ్మర్థ్ పోర్టల్‌ ను కూడా ప్రధాని ప్రారంభించారు. వివిధ పథకాల రుణాల లభ్యతపై ఈ పోర్టల్‌లో సమాచారం పొందుపరిచారు.

మన కరెన్సీని అంతర్జాతీయ వాణిజ్యంలో భాగం..

చేసేందుకు బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక కార్పోరేట్‌ , పాలనాపద్ధతులను అనుసరించాలని ప్రధాని సూచించారు. భారత్‌ ఇప్పటికే అనేక ఆర్థిక పరిష్కార వేదికలను ఆవిష్కరించిందన్నారు. వాటి వినియోగాన్ని పెంచడం కోసం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, వాటిని విశ్వవాప్తం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం మన దేశాన్ని ప్రపంచం ఒక పెద్ద వినియోగ మార్కెట్‌గానే కాకుండా , అనేక సమస్యలకు పరిష్కార వేదికగా కూడా చూస్తోందని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement