Wednesday, May 8, 2024

పొగాకు హెచ్చరిక రూల్స్‌పై ఓటీటీ అభ్యంతరం

థియేటర్ల తరహాలోనే ఓటీటీల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలను తప్పనిసరి చేయడంపై ఓటీటీ ఫ్లాట్‌ఫారాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ‘పొగాకు వినియోగం క్యాన్సర్‌ కారకం, పొగాకు వినియోగం ప్రాణాంతకం’ అని సినిమా థియేటర్లు, టీవీల్లో ప్రదర్శించినట్లుగానే ఓటీటీల్లోనూ కార్యక్రమం ప్రారంభానికి ముందు, మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా ప్రకటన ఉండాలని కేంద్రం ఇటీవల ఓటీటీలకు సూచించింది. దీంతో పాటు పొగాకు ఉత్పత్తులను, వాటి వినియోగాన్ని చూపే దృశ్యాలు వచ్చినప్పుడు డిస్‌క్లెయిమర్‌ను చూపించాలని పేర్కొంది.

ఈ హెచ్చరికలు కూడా ఓటీటీ కంటెంట్‌ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, ఈ నిబంధన పట్ల ఓటీటీ కంపెనీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. హెచ్చరికలను జోడించడం కోసం ఇప్పటికే ఉన్న లక్షలాది గంటల కంటెంట్‌ను ఎడిట్‌ చేయడమనేది తలకుమించిన భారంగా భావిస్తున్నాయి. ఈ మేరకు అమెజాన్‌, డిస్నీ, నెట్‌ప్లిnక్స్‌తో పాటు జియో సినిమాకు చెందిన ప్రతినిధులు ఇటీవల సమావేశమైనట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయపరంగా ముందుకెళ్లడంపై సంస్థలు చర్చిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement