Wednesday, May 8, 2024

గుడ్‌ న్యూస్ ! ఆన్‌లైన్‌లోనే ఓటరు కార్డు.. ప్రకటించిన ఎన్నికల సంఘం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఓటర్లుకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇకనుంచి ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో ఓటరు కార్డును పొందేందుకు అవకాశం కల్పించింది. క్షణాల్లో ఓటర్లు ఓటరు కార్డును ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ ఓటరు ఐడీ కార్డును పొందే అవకాశం కల్పించింది. ఓటరు ఐడీ- కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఇంటి వద్ద నుంచి డిజిటల్‌ ఓటరు ఐడీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల కమిషన్‌ కల్పించింది.

ఓటరు ఐడీ కార్డును ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే?

  1. ఓటరు ఐడీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు సైబర్‌ కేఫ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే మీ ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ల ద్వారా ఓటరు ఐడీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  2. ఓటరు ఐడీ కార్డును పొందడానికి ముందుగా నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ http://voters.eci.gov.in లాగిన్‌ చేయాలి.
  3. హోమ్‌ పేజీలోని E-Epic డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  4. ఇందులో రిజిస్టర్‌ మొబైల్‌ లేదా ఈమెయిల్‌ ఐడీ లేదా E-Epic నెంబర్‌ వంటి సమాచారం ఇచ్చి క్యాప్చాతో కూడిన రిక్వెస్ట్‌ ఓటీపీని నొక్కాలి.
  5. మీ రిజిస్టర్‌ మొబైల్‌ ద్వారా అందుకున్న ఓటీ-పీ ఎంటర్‌ చేయాలి.
  6. ఇప్పుడు డిజిల్‌ ఓటరు ఐడీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి మీరు E-Epic పై క్లిక్‌ చేయాలి.
    ఇలా చేయడం ద్వారా ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ద్వారా పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో మీ డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
Advertisement

తాజా వార్తలు

Advertisement