Monday, April 29, 2024

OnePlus 12R | లీకైన వ‌న్‌ప్ల‌స్ 12ఆర్ ఫీచ‌ర్లు.. జ‌న‌వ‌రిలో లాంచ్ చేయ‌నున్న కంపెనీ

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ నుండి వన్ ప్లస్ 11ఆర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయింది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్-1, 5జీ ఎస్ఓసీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ సూపర్ వూక్ ఎస్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియ‌న్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కాగా, 11 ఆర్ కు కొనసాగింపుగా వన్ ప్లస్ 12 ఆర్ ను రిలీజ్ చేయనుంది కంపెనీ. వచ్చే ఏడాది (2024) జనవరిలో చైనాలో ఈ ఫోన్ ని రిలీజ్ చేసే చాన్స్ ఉంది. అయితే ఈ అప్ క‌మింగ్ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరి వీటి ప్రకారం వన్ ప్లస్ 12 ఆర్ 5జీ స్పెసిఫికేషన్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..

లీక్డ్ ఫీచర్స్ & స్పెసిఫికేషన్స్..

  • 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ ప్లే విత్ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ వచ్చే అవకాశముంది.
  • 11ఆర్ తో పోల్చితే కాస్త కర్వ్డ్ డిస్ ప్లేతో 12 ఆర్ రానున్నుట్లు తెలుస్తోంది.
  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సీజన్ ఓఎస్ 14 ఉండనుంది.
  • ఆక్టా కోర్ 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ విత్ అడ్రెనో 740 జీపీయూతో వన్ ప్లస్ 12 ఆర్ రూపొందనుంది.
  • 16 జీబీ LPDDR5 ర్యామ్, 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఉండనుంది.
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 32 మెగా పిక్సెల్ సెన్సార్ విత్ 2x ఆప్టికల్ జూమ్ ఎనేబుల్డ్ లెన్స్ వంటి ఫీచర్లుంటాయి.
  • ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే 16 మెగా పిక్సెల్ గా ఉండనుంది.
  • బ్యాటరీ సామర్థ్యం కూడా 5,500 ఎంఏహెచ్ కు పెరగనుంది. 100 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.
  • ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఫోన్ కు పటిష్ట భద్రత ఉండనుంది.
  • ఇక ధర, కలర్ వేరియంట్ల గురించి స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం భారత్ లో వన్ ప్లస్ 11ఆర్ ప్రారంభ ధర రూ. 39,999 గా ఉంది. దీంతో 12 ఆర్ ప్రారంభ ధర దీనితో పోల్చితే ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశముంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement