Friday, April 26, 2024

స్పై థ్రిల్ల‌ర్‌గా నిఖిల్ కొత్త మూవీ.. మూవీకోసం స్పెష‌ల్ ప్రాక్టీస్..

యంగ్ అండ్ డైన‌మిక్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వరుస సినిమాలతో ఫుల్ జోరుమీదున్నాడు. 2019 అర్జున్ సుర‌వ‌రం సినిమా త‌ర్వాత కొవిడ్ కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాలో క‌నిపించ‌ని నిఖిల్.. ఇప్పటికే రెండు సినిమాలను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిధ్దంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాటిలో ఒకటి కార్తికేయ సినిమాకు సీక్వేల్ గా తెరకెక్కినున్న‌ కార్తికేయ 2. మరొకటి అనుపమా ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా 18 పేజెస్. వీటితోపాటు ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు ఈ కుర్ర హీరో.. నిఖిల్ 19వ చిత్రం ఎడ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తుండ‌గా.. గూఢచారి, ఎవరు, హిట్ వంటి హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన‌ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ మార్చి నుండి మనాలీలో ప్రారంభమవుతుంది.

ఈ షెడ్యూల్లో కొన్ని హై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనుంది యూనిట్. వాటికోసం నిఖిల్ ఊపిరి బిగబట్టే స్టంట్స్ చేయడానికి శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం నిఖిల్ లైవ్ వెపన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను షేర్ చేశాడు. యాక్షన్ తో కూడిన స్పై థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ కన్పర్మ్ చేయాల్సిఉంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయ్యింది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్లో ప్రముఖ సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు. జూలియన్ అమరు ఎస్ట్రాడా సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా, దర్శకుడు గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ భాద్యతల్ని కూడా నిర్వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement