Saturday, May 25, 2024

రేప‌టినుంచి నేతన్న బీమా, 10 రోజుల్లో నామినీ ఖాతాలో 5 లక్షలు జమ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చేనేత, మరమగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులకు మరణానంతరం నేతన్నబీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌ ఆదివారం నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్కీమ్‌ను ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారని ప్రభుత్వం తెలిపింది. ఎల్‌ఐసీ ద్వారా బీమా అందించి మరణించిన నేతన్న కుటుంబానికి భరోసా కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుడు మరణించిన 10 రోజుల్లో నామినీ ఖాతాలో రూ.5 లక్షల బీమాసొమ్ము జమ చేస్తామని తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement