Saturday, April 27, 2024

అల్ల‌రి న‌రేష్ పోలీస్ ప‌వ‌ర్ ..

కామెడీ పాత్రల నుండి వైవిధ్యమైన క్యారెక్టర్లకు టర్న్‌ అయిన అల్లరి నరేష్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ‘నాంది’ సినిమాతో కమర్షి యల్‌ విజయం అందుకున్నారు. ఇప్పుడు నాంది కాంబినేషన్‌ అల్లరి నరేష్‌, విజయ్‌ కనకమేడల మరో ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్‌ పోలీస్‌గా కనిపిస్తారు. ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ సింగిల్‌ ”దేవేరి… ” 19న విడుదల కానుంది. వర్షం పడుతుండగా అల్లరి నరేష్‌ , మిర్నా బైక్‌ పై కూర్చొని వున్న పోస్టర్‌ ని చూస్తుం టే .. దేవేరి ఒక అందమైన రొమాంటిక్‌ మెలోడీ అనిపిస్తుంది.యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందు తు న్న ‘ఉగ్రం’ను షైన్‌ స్కీన్స్ర్‌ బ్యాన ర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది గ్రాండ్‌గా నిర్మిసు ్తన్నారు. తూమ్‌ వెంకట్‌ కథ అందించగా, అబ్బూరి రవి సంభాషణలు రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement