Monday, April 29, 2024

అదిరింద‌య్యా నాగార్జున ‘నా సామిరంగ’ ఫ‌స్ట్ లుక్

నాగార్జున బర్త్ డే సందర్భంగా తాజాగా ఆయ‌న నటిస్తున్న నా సామిరంగ మూవీ టైటిల్ పోస్ట‌ర్ , నాగ్ ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. కాస్త రఫ్ లుక్ తో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో నాగ్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ఈ సారి పండక్కి నా సామిరంగ’ అంటూ, ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా నాగ్ తోనే చెప్పించారు. ఇక ఈ మూవీ ద్వారా ర‌చ‌యిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement