Sunday, May 12, 2024

సెప్టెంబ‌ర్ లోనూ ఎండ మంట‌లే… వ‌ర్ష‌పు మేఘాలు కాన‌రావంటున్న వాతావ‌ర‌ణ శాఖ

హైదరాబాద్ – నైరుతీ రుతుప‌వానాలు ఆల‌స్యంగా ప్ర‌వేశించి కొన్ని రోజుల పాటు కుంభ‌వృష్టి కురిపించి మ‌టుమాయం అయ్యాయి.. అవ‌స‌రానికి మించి కురిసిన వ‌ర్షాల‌తో రైతుల‌కు న‌ష్టాలే మిగిలాయి.. ఇక వ‌ర్షం చూసి నాట్లువేసిన రైతు రోజు ఆకాశం వైపు చూస్తున్న వ‌ర‌ణుడు మాత్రం క‌రుణించ‌డంలేదు.. చేలో పండ ఎండుతుంటే , అన్న‌దాత క‌ళ్ల‌లో క‌న్నీటి చుక్క‌లు రాలుతున్నాయి.. 1972 తర్వాత ఆగస్టు నెలలో రాష్ట్రంలో ఈసారే అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కేవలం 74.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 60 శాతం తక్కువ కావడం గమనార్హం. కనీసం వచ్చే నెలలో అయినా మంచి వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న రైతులకు వాతావరణ శాఖ చేదు వార్త చెప్పింది. వచ్చే నెలలోనూ వర్షాభావ పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తోంది.


దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని తెలిపింది. వాస్తవానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో దేశంలో ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షాపాతం ఏర్పడింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా మంచి వర్షాపాతం నమోదైంది. కానీ, తెలంగాణలో వ‌ర్షం కొన్ని జిల్లాల‌కే ప‌రిమిత‌మైంది.. క‌నీసం సెప్టెంబ‌ర్ లోనైనా వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఆశ‌ప‌డుతున్న రైతుల‌కు వాతావ‌ర‌ణ శాఖ చేదు క‌బురే చెప్పింది.. ఆక్టోబ‌ర్ లో వ‌ర్షాలు కుర‌వ‌వ‌చ్చ‌ని పేర్కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement