Saturday, April 27, 2024

స‌ర్కారు వారి పాట చిత్రం నుంచి – మురారి వా సాంగ్ రిలీజ్

స‌ర్కారు వారి పాట చిత్రం నుంచి మురారి వా సాంగ్ ని రిలీజ్ చేశారు. మహేశ్ బాబు – కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య మే 12న రిలీజ్ అయిన ఈసినిమా ముందు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆతరువాత కలెక్షన్స్ పరంగా భారీ రెస్పాన్స్ ను సాధించింది. అయితే సర్కారువారి పాట సినిమాలో అన్నింటికంటే హైలెట్ ఈ సినిమా మ్యేజిక్. ఈ సినిమా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమన్ స్వరపరిచిన బాణీలు ఈ సినిమా సక్సెస్ లో మెయిల్ రోల్ పోషించాయి. ముఖ్యంగా కళావతి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు మ మ మహేశా సాంగ్ కూడా ఒక రేంజ్ లో దూసుకుపోయింది.ఈ రెండు పాటతో సర్కారువారి పాట రిజల్ట్ మారిపోయింది. ఎక్కడ చూసినా కళావతి పాటే వినిపిస్తుంది ప్రస్తుతం. అయితే ఈసినిమా కోసం షూట్ చేసి కొన్ని సీన్స్ తో పాటు ఓపాటు డ్యూరేషన్ ప్రాబ్లమా్ తో సినిమాలో పెట్టలేకపోయారు. ప్రస్తుతం ఆ పాటను విడిగా రిలీజ్ చేశారు. మురారివా .. మురారివా .. మురళీ వాయిస్తూ ముడేస్తివా అంటూ సాగే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మహేశ్ బాబు – కీర్తి సురేశ్ పై బ్యూటిఫుల్ సెట్లో ఈ పాటను కలర్ఫుల్ గా చిత్రీకరించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement