Tuesday, April 30, 2024

మచ్ అవైటెడ్ లియో ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వెల్ల‌డించిన మేక‌ర్స్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ అప్ క‌మింగ్ మూవీ ‘లియో’. ఈ మూవీపై అభిమాన‌ల్లొ మెద‌టి నంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి బ్లాక్‍బాస్టర్లు సాధించిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ మూవీకి ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తుండ‌టం.. ‘మాస్టర్’ మూవీ తర్వాత విజయ్ – లోకేశ్ కాంబినేషన్‍లో తెరెక్కుతున్న రెండో మూవీ కావ‌డంతో ఫ్యాన్స్ లో ఫుల్‍ హైప్ క్రియేట్ అయింది.

కాగా, ఈ మూవీ అక్టోబర్ 19వ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‍లో బుకింగ్స్ జరుగుతుండగా.. లియోకు భారీ స్పందన వస్తోంది. ఇక రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర పడుతుండ‌టంతో మూవీ టీమం ప్ర‌మోష‌న్స్ పై దృష్టి సారించింది. ఈ తరుణంలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించింది. లియో సినిమా ట్రైలర్ అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement