Thursday, May 2, 2024

OTT | ఓటీటీలో ‘‘మంత్ ఆఫ్ మధు’’.. రిలీజ్ డేట్ ఫిక్స్

‘‘కలర్స్’’ స్వాతి గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన స్వాతి రెడ్డి.. ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘‘మంత్ ఆఫ్ మధు’’. ఈ సినిమాలో ఆమె ప్రేమికుడిగా, భర్తగా యువ హీరో నవీన్ చంద్ర కనిపించారు. శ్రేయా నవేలి మరో ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాకి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించ‌గా.. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల అయ్యింది.

కాగా, ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. థియేటర్లలలో రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాత ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. ఇక ఈ మూవీ నవంబర్ 3వ తేదీ నుంచి తమ ఓటీటీ వేదికలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని ఆహా ఓటీటీ పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement