Sunday, April 28, 2024

Honda | హోండా నుంచి కొత్త బైక్‌ ట్రాన్సల్ప్.. ధర రూ. 10.99 లక్షలు

గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన హోండా కొత్త బైక్‌ ట్రాన్సల్ప్, తాజాగా మన దేశ మార్కెట్‌లోకి వచ్చింది. హోండా ఎక్స్‌ఎల్‌ 750 ట్రాన్సల్ప్ పేరుతో ఈ బైక్‌ ఇండియన్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర 10.99 లక్షల రూపాయలుగా కంపెనీ పేర్కొంది.

- Advertisement -

1980లో వచ్చిన ట్రాన్స్‌ల్స్‌ బైక్‌కు ఆధునిక హంగులు సమకూర్చిన కంపెనీ ఎక్స్‌ఎల్‌ 750 ట్రాన్సల్స్‌ పేరుతో విడుదల చేసింది. ఈ బైక్‌ ముందు 21 అంగుళాలు, వెనుక 18 అంగుళాల వీల్స్‌తో వస్తోంది. ఇందులో డిస్క్‌ బ్రేక్‌లతో పాటు డ్యుయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ను ఇచ్చారు. ముందు వీల్‌లో 43 ఎంఎం షోవా యూఎస్‌డీ సస్పెన్షన్‌ ఉంది.

స్పీడో మీటర్‌, టాకో మీటర్‌, గేర్‌ పొజిషన్‌ ఇండి కేటర్‌, ఇంధన వినియోగం, రైడింగ్‌ మోడ్స్‌ వంటి ఆప్షన్లతో టీఎఫ్‌టీ డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బైక్‌ రాస్‌ వైట్‌, మ్యాట్‌ బాలిస్టిక్‌ బ్లాక్‌ రంగుల్లో ఇది లభిస్తుంది. ఈ బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. తొలి దశలో కేవలం 100 బైక్‌లను మాత్రమే అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement